May 04,2023 00:24

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి

ప్రజాశక్తి-అనకాపల్లి
రెవెన్యూ శాఖలోని ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ఈ-ఆఫీసులోనే జరగాలని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం జరిగిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రీ సర్వే, స్పందన, ధ్రువపత్రాల జారీ, 22ఎ వంటి పనులు మరింత వేగవంతం కావాలన్నారు. స్పందన అర్జీల పరిష్కారంలో మరింత వేగవంతంగా జరిగేందుకు ప్రతి శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆర్డీవో నుంచి ఎల్‌డిసి వరకు అందరూ ఈ-ఆఫీసునే అనుసరించాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి మాట్లాడుతూ సర్వే రాళ్లు మొదటి దశ పూర్తి చేసినందుకు అధికారులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో రెండవ దశ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ధాత్రి రెడ్డి, డిఆర్‌ఓ వెంకటరమణ, జిల్లా సర్వే అధికారి, మండల సర్వే అధికారులు పాల్గొన్నారు.