కబ్జా స్థలంలో హెచ్చరిక బోర్డును పాతిన రెవెన్యూ అధికారులు
ప్రజాశక్తి - ఆరిలోవ : చినగదిలి మండలం ఆరిలోవ, తోటగరువు, బిటిఆర్.నగర్‌లో కబ్జాకు గురైన రెవెన్యూ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బిటిఆర్ నగర్‌లో కొండవాలు ప్రాంతాన్ని ప్రొక్లైనర్‌తో తవ్వి అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి చదునుచేసి కబ్జాకు తెరతీసాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు చినగదిలి తహశీల్దారు పాల్ కిరణ్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ ప్రవీణ్, విఆర్‌ఒ సత్యందొర, 17వ సచివాలయ విఆర్‌ఒ మౌనిక, సిబ్బందితో వచ్చి కబ్జాకు గురైన స్థలంలో రెవెన్యూ హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. కబ్జాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ హెచ్చరించారు.










