Aug 18,2023 22:18

మాట్లాడుతున్న కలెక్టర్‌

మాట్లాడుతున్న కలెక్టర్‌
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి
ప్రజాశక్తి-నెల్లూరు :ఆత్మకూరు నియోజకవర్గంలో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దష్టి సారించాలని కలెక్టర్‌ ఎం. హరి నారాయణన్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆత్మకూరు నియోజక వర్గ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక శాసన సభ్యుల దష్టికి వచ్చిన రెవిన్యూ సమస్యలపై జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో వచ్చిన రెవెన్యూ సమస్యల పరిష్కార పురోగతిపై శు క్రవారం కలెక్టరేట్‌ లో ఆత్మకూరు శాసన సభ్యులు మేకపాటి విక్రమ్‌ రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కూర్మనాధ్‌ సమక్షంలో ఆత్మకూరు ఆర్‌డిఒ కరుణ కుమారి, ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా వచ్చిన ధరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై క్షుణ్ణంగా సమీక్షించి పలు సూచనలు ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు శాసన సభ్యులు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా శాసన సభ్యులు దష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి సంబంధిత మండల తహశీల్దార్లు ప్రత్యేక దష్టి సారించి నిర్ధేశించిన గడువులోగా పరిష్కరించేలని ఆదేశించారు
. గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న కు చెబుదాం కార్యక్రమాల్లో రెవెన్యూ కు సంబంధించిన సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయన్నారు. చుక్కల భూముల జాబితా నుంచి ఇంకా తొలగించని వాటికి అత్యధిక ప్రాధాన్యతచ్చి కలెక్టర్‌ కు ప్రతిపాదనలు పంపాలన్నారు. పేదలకు నివేశన స్థలాల పట్టాల మంజూరు కు సంబంధించి భూసేకరణ ఎక్కడైన పెండింగ్లో ఉంటే సత్వరం భూ సేకరణ సమస్యలను పరిష్కరించేలా తహశీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ చూపా లన్నారు. సమావేశంలో ల్యాండ్‌ సర్వే రికార్డ్స్‌ ఎడి హనుమాన్‌ ప్రసాద్‌, తహశీల్దార్లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.
4