రెవెన్యూ రికార్డుల ప్రకారమే రిజిస్ట్రేషన్లు
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రభుత్వ అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్ రెవెన్యూ రికార్డుల రైతుల వివరాల ప్రకారమే జరుగుతాయని తహశీల్దార్ జగదీష్ బాబు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో 20 సంత్సారాలు ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్న రైతుల వివరాలను సేకరిస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు 20 సంవత్సరాలు ప్రభుత్వ అసైన్డ్ భూములు ఉన్న రైతుల వివరాలను పకడ్బంధీగా తమ సిబ్బందితో అన్ని రెవెన్యూ రికార్డులు పరిశీలించి వారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియ మంగళవారానికి పూర్తి చేయడం జరుగుతుందని, అనంతరం జాబితాను కార్యాలయం సచివాలయాలలో రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ ప్రక్రియలో నమోదు గానీ రైతులు తమతమ వద్ద 20 సంవత్సరాలకు సంబంధించిన రైతు వివరాలను తీసుకువచ్చి వారి వారి పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం నమోదైన ప్రతి రైతు ప్రభుత్వం అందిస్తున్న రిజిస్ట్రేషన్‌కు అర్హులన్నారు.










