
మాట్లాడుతున్న కమిషనర్
రెవెన్యూ లక్ష్యాలను సాధించాలి..
ప్రజాశక్తి-నెల్లూరు సిటీ:నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తిపన్ను, కుళాయిపన్ను, డ్రెయినేజీ పన్ను కమర్షియల్ భవనాల బకాయిలు పన్ను, యూజర్ ఛార్జీల వసూళ్లకై సచివాలయాలకు నిర్దేశించిన లక్ష్యాలను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ వికాస్ మర్మత్ సచివాలయాల అడ్మిన్, శానిటేషన్, అమెనిటీస్ కార్యదర్శులను ఆదేశించారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయ కార్యదర్శులు, ఇంజినీరింగ్, రెవెన్యూ విభాగం, ఆరోగ్య శాఖ, అధికారులతో స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో మంగళవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశానికి ఆలస్యంగా హాజరైన సచివాలయాల కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పన్నుల వసూళ్లలో వెనకబడిన కార్యదర్శులు తమ పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. ప్రతీ 15 రోజులకు ఒకసారి రెవెన్యూ, కుళాయి పన్ను, యూజర్ ఛార్జీలు వసూళ్లపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పురోగతిని పర్యవేక్షిస్తానన్నారు. రానున్న మూడు నెలల్లో బకాయిలు పెండింగు లేకుండా అన్ని రకాల పన్నులను పూర్తిస్థాయిలో వసూళ్ల చేయాలన్నారు.
సమావేశంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంజరు, చంద్రయ్య, ప్రసాద్, రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్‌స్పెక్టరులు పాల్గొన్నారు.