ప్రజాశక్తి -రంపచోడవరం
ఈ నెల 11 నుండి 14 వరకు గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగిన రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాల్లో రంపచోడవరం డివిజన్ ఉద్యోగులు ప్రతిభ కనబర్చారు. అథ్లెటిక్స్ 45 సంవత్సరాలు పైబడిన విభాగంలో షార్ట్ పుట్, డిస్కస్-త్రోలో కాంస్య పతకాలను స్థానిక సబ్-కలెక్టర్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు కొలిపే విక్టర్ పాల్, ఎ.పాల్ బాబు సాధించారు. మహిళల డిస్కస్ త్రోలో కాంస్య పతకం, జావెలిన్ త్రోలో వెండి పతకం ఎలక్షన్ సీనియర్ సహాయకులు ఇందిరా బాయి గెలుచుకున్నారు. త్రో బాల్, టగ్ ఆఫ్ వార్ నందు ద్వితీయ బహుమతులను తూర్పుగోదావరి జిల్లా సిబ్బందితో కలిసి రంపచోడవరం మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది టి.చింతాలమ్మ కె.మల్లమ్మ ద్వితీయ బహుమతులు పొందారు. ఈ క్రీడల్లో చుక్క చంటి, ఎం.ఆనందీశ్వరావు కె.శివ కుమార్, ఎస్.పవనేంద్రకుమార్, బి.గంగరాజు, ఎం.కేశవ చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రీడల్లో పతకాలు సాధించిన వారిని సబ్ కలెక్టర్ శుభం బన్సాల్, తహశీల్దారు పిఎన్‌వి.ప్రసాద్, రంపచోడవరం డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ సెక్రటరీ ఎమ్‌డి పాషా (అక్రం) ప్రత్యేకంగా అభినందించారు.










