- డిఆర్‌వో రాజశేఖర్
ప్రజాశక్తి-చిత్తూరు: రెవిన్యూకు సంబంధించి జిల్లాలో వివిధ కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను వెంటనే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి యన్.రాజశేఖర్ పేర్కొన్నారు. గురువారం రాత్రి డిఆర్‌ఓ చాంబర్ నందు రెవిన్యూకు సంబంధించి ప్రభుత్వ కేసులు పరిస్కారంపై లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్‌ఓ మాట్లాడుతూ రెవిన్యూకు సంబంధించి జిల్లాని వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వానికి సంబంధించి వివిధ రకాల కేసులను లా అధికారులు తొందరగా పరిస్కారం చేయాలని వారికి సూచించారు. ప్రతి నెల మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న కేసులు ఎన్ని కేసులు పరిస్కారం చేసిన వాటికి సంబంధించి, ఇంకా మిగిలిన కేసులు ఏయే స్టేజిలో ఉన్నాయాని, మండలాల వారిగా కేసుల వివరాలకు సంబంధించి రిపోర్ట్‌ను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రతి నెల పంపించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ నుండి సి సెక్షన్ పర్యవేక్షకులు వాసుదేవన్, లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.










