రెవెన్యూ అధికారులతో న్యాయమూర్తుల సమావేశం
ప్రజాశక్తి పలమనేరు: సుప్రీం కోర్ట్, రాష్ట్ర హైకోర్టు, చిత్తూరు జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 21 జరగబోవు స్పెషల్ లోక్ అదాలత్ గురించి పలమనేరు ,గంగవరం , బైరెడ్డిపలి, వీ.కోట రెవెన్యూ అధికారులతో న్యాయ మూర్తులు శనివారం సమావేశం నిర్వహించారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు లో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు లో పెండింగులో ఉన్న రెవెన్యూ కేసులను సామరస్యంగా పరిష్కరించడానికి కక్షిదారులతో సహకరిం చాలని ఆదేశించారు . పలమనేరు సీనియర్ సివిల్ న్యాయమూర్తి పి శ్రీనివాసరావు మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న నాలుగు మండలాల వారిగా రెవెన్యూ కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ సమావేశంలో పలమనేరు జూనియర్ సివిల్ జడ్జి కె రవి ,పలమనేరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె లక్ష్మీపతి , ఏ. జి .పి .మోహన్ రెడ్డి , పలమనేరు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శివయ్య, పలమనేరు, గంగవరం తహశీల్దార్లు బైరెడ్డిపల్లి ఆర్.ఐ సరిత , వీ.కోట సీనియర్ అసిస్టెంట్ పాల్గొన్నారు.










