కడప అర్బన్ : రైతు చల్లగా ఉంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మిన రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పాటు పడుతోందని కలెక్టర్ వి.విజరు రామరాజు అన్నారు. శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కౌలు రైతులకు పిఎం కిసాన్ 'వైఎస్‌ఆర్ రైతు భరోసా' 5వ ఏడాది మొదటి విడత ఆర్ధిక సాయంతో పాటు, 2023 మే- జూన్ మాసాలకు సంబంధించి పంటల నష్టానికి ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని.. కంప్యూటర్ బటన్ నొక్కిరైతుల ఖాతాలకు నేరుగా బదిలీ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారం భించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుంచి కలెక్టర్ వి.విజరు రామరాజు తో పాటు, నగర మేయర్ కె.సురేష్ బాబు, ఎమ్మెల్సీలు రామచంద్రా రెడ్డి, రమేష్ యాదవ్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ముఖ్య అతిధులుగా హాజ రయ్యారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కలెక్టర్ అతిధులతో కలిసి జిల్లాలో పిఎం కిసాన్ 'వైఎస్‌ఆర్ రైతు భరోసా' జిల్లాలో1767 మంది రైతులకు గాను రూ. 1,32, 52,500 లతో పాటు 1,435 మంది రైతులకు రూ.2.026 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని మెగా చెక్కు రూపంలో రైతులకు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఇంకా అర్హత ఉండీ 'వైఎస్‌ఆర్ రైతు భరోసా' పథకం లబ్ది ఇంకను పొందని వారుంటే సంబంధిత వార్డు లేదా గ్రామ వాలంటీర్లను, సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్‌ను, మండల వ్యవసాయ అధికారిని గానీ సంప్రదించాలన్నారు. ఆర్‌బికెలలో నిరంతరం రైతులకు సలహాలు సూచనలు అందేలా కాల్ సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి నాగేశ్వరరావు, ఉద్యానశాఖ డిడి రాజీవ్ మైఖేల్, వ్యవసాయశాఖ ఎడిలు అను బంధ శాఖల అధికారులు, లబ్దిదారులయిన రైతులు పాల్గొన్నారు.










