గిట్టుబాటు కాక చెరకు సాగుదారుల దిగాలు
ఫ్యాక్టరీలో సమస్యలతో కాటాల్లో పడిగాపులు
రోజుల తరబడి ఎండిపోతుండడంతో తగ్గుతోన్న బరువు
ఆవేదన చెందుతున్న రైతులు... పట్టని యాజమాన్యం
ప్రజాశక్తి -బుచ్చయ్యపేట : గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరుకును సరఫరా చేసే రైతులకు ఈ సీజన్‌లో సమస్యలు, కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.ఈ సీజన్‌లో ఆది నుంచి రైతుల కష్టాలు కొనసాగుతున్నారు. ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిచిపోవడంతో చెరుకు సరఫరాలో అవాంతరాలు తప్పడం లేదు. ప్రస్తుతం చెరకు సాగుకు అయ్యే ఖర్చుతో పోలిస్తే, గిట్టుబాటు కాని ధరలతో ఒకవైపు సతమతమౌతున్న రైతులకు, ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిచిపోవడంతో చెరకు కాటాల్లో వారం, పదిరోజులపాటు వాహనాల్లోనే చెరుకు బళ్లువాహనాల్లో ఉండిపోవడంతో అవికాస్తా ఎండి , బరువు తగ్గి నష్టపోయే పరిస్థితి ఉందని వాపోతున్నారు. రోజుల తరబడి
ఈ సీజన్‌లో గోవాడ చక్కెర కర్మాగారం తరచూ మరమ్మతులకు గురికావడంతో రైతులు సరఫరా చేసిన సరకు కాటాల వద్దే పడిగాపులు పడుతోంది. చెరకు తూనిక కాకుండా వారం, పది రోజులపాటు, తూనిక కేంద్రాలలోనే నిలిచిపోతుండడంతో చెరకు ఎండి, బరువు తగ్గిపోతోందని రైతులు వాపోతున్నారు. మండలంలో బుచ్చయ్యపేట, వడ్డాది,చెరకు తూనిక కేంద్రాల ద్వారా గోవాడ చక్కెర కర్మాగారానికి చెరకున సరఫరా చేస్తున్నారు. గోవాడ చక్కెర కర్మాగారంలో ఈ సీజన్లో ఇప్పటికే పలుమార్లు మరమ్మతులకు గురై క్రషింగ్ సాఫీగా సాగడం లేదు.
చక్కెర కర్మాగారం నుండి సరఫరా చేసిన చెరకుకు సకాలంలో డబ్బులు చెల్లించక, పండిన పంటకు తగిన గిట్టుబాటు ధర లేక దిగాలుగా ఉన్న రైతులకు ఈ కొత్త సమస్య ఆశనిపాతంగా మారింది. గత మూడేళ్లతో పోలిస్తే ఈ ఏడాది చెరకు సాగు బాగా తగ్గిందని రైతులు అంటున్నారు. చెరకు నరికివేత నుంచి వాహనాల్లోకి చెరకు ఎత్తే వరకు పనులన్నీ చేయడానికి నాలుగైదు రోజుల సమయం పడుతోందని, ఈలోగా పొలాల్లోనే చాలా వరకు చెరకు ఎండిపోతోందని రైతులు అంటున్నారు. తీరా నాటుబళ్లు, ట్రాక్టర్లు, లారీల్లో తూనిక కేంద్రానికి చెరుకు తరలించిన తర్వాత అక్కడ మరో వారం పదిరోజులు పాటు ఎండలోనే ఉండిపోవడంతో మరింత ఎండిపోతోంది.
బుచ్చయ్యపేట చెరకు తూనిక కేంద్రానికి, బుచ్చయ్యపేట ఐతంపూడి కేపీ.అగ్రహారం కొండపాలెం, గున్నెంపూడి, పి.భీమవరం, దిబ్బిడి పోలేపల్లి, చిన్నమదిన, పెద్దమదీనా, సరఫరా అవుతుంది. అవడ్డాది చెరుకు తూనిక కేంద్రానికి, వడ్డాది వీరవల్లి ముకుందపురం, బంగారు మెట్ట లోపూడి,ఏల్.సింగవరం పొట్టి దరపాలెం, బుదిరెడ్లపాలెం తదితర గ్రామాల నుండి చెరకు సరఫరా చేస్తారు. ట్రాక్టర్లు మరియు టైరు బళ్ల ద్వారా చెరకు తీసుకొస్తున్నారు. అయితే ఇపుడు ఫ్యాక్టరీలో క్రషింగ్ సాఫీగా సాగకపోవడంతో దాదాపు పది రోజుల వరకు చెరకు తూనిక కేంద్రాల వద్ద బళ్లు, వాహనాల్లోనే అలాగే ఉండిపోతోందని రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి చెరకుతో ఉన్న వాహనాలకు అద్దె తడిసి మోపెడౌతుంటే, మరోవైపు చెరకు ఎండిపోయి, బరువు తగ్గడంతో తూకంలో తేడాతో మరోవిధంగా నష్టం కలుగుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. చెరుకు సాగు అంటేనే భయపడే పరిస్థితులను కల్పించడం విచారకరమని రైతులు ఆవేదన చెందుతున్నారు.
రెండు విధాలుగా రైతన్నకు నష్టం
ఫ్యాక్టరీకి చెరుకు సరఫరాలో నెలకొన్న ఇబ్బందులతో రైతులకు నష్టం తప్పడం లేదు.నాలుగైదు రోజులు పొలంలో ఎండిపోయి, ఇపుడు కాటాల వద్ద పదిరోజులపాటు కాటాల వద్ద ఉండిపోవడంతో చెరకు ఎండిపోతోంది. అసలే ధరలేదు. ఇపుడు ఎండి బరువు తగ్గడంతో రెండువిధాలుగా రైతు నష్టపోతున్నాడు.
ఫోటో 2డొంకిన రాము, రైతు బుచ్చయ్యపేట
కాటాల వద్ద పడిగాపులు
రైతు పొలం నుంచి చెరుకును ఐదు రోజుల క్రితం బుచ్చయ్యపేట కాటాకు తీసుకొచ్చాను. ఇంకా తూకం కాకపోవడంతో పడిగాపులు పడుతున్నాను. చెరుకును తెచ్చేందుకు టన్నుకు రైతు రూ.800 ఇస్తారు. ఇలా రోజుల తరబడి ఇక్కడే ఉండిపోవడంతో కూలీ సైతం గిట్టుబాటు కావడం లేదు.
3కంచిపాటి నాగేశ్వరరావు, ట్రాక్టర్ డ్రైవర్, దిబిడి










