Apr 19,2023 21:53

ఉష్ణోగ్రత నమోదు కేంద్రం

ప్రజాశక్తి - రెంటచింతల : మండల కేంద్రమైన రెంటచింతలలో బుధవారం భానుడు భగభగమన్నాడు. ఎన్నడూ లేని విధంగా బుధవారం 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణంగా మేలో రోహిణి కార్తె సందర్భాల్లో ఇలా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అయితే ఏప్రిల్‌లోనే నిప్పుల కొలిమిలా కాచిన ఎండతో ఇక్కడి ప్రజలు అల్లాడారు. పిల్లలు, వృద్ధుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా పనులు చేసుకునే కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాన్ను రోజుల్లో ఎండ ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళనకు గురవుతున్నారు. గతంలో 2002 మేలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.