Oct 10,2022 23:41

కాలు చచ్చుబడిన శైల

ప్రజాశక్తి- సీలేరు
తమ కుమార్తె గొల్లూరి శైలకు వికలాంగు పెన్షన్‌ మంజూరు చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రభుత్వ అధికారులను వేడుకుంటున్నారు. గూడెం కొత్తవీధి మండలం దుప్పిలివాడ పంచాయతీ బందవీధి గ్రామానికి చెందిన గొల్లూరు శైల అనారోగ్య కారణంగా రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆమె దయనీయస్థితిలో బతుకుతుంది. శైల తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన గిరిజనులు. కుమార్తెకి వారే సేవలు చేస్తున్నారు. సోమవారం శైల తండ్రి గొల్లూరి ఆనంద్‌ బాబు స్థానిక విలేకర్లకు తమ కుమార్తె గోడును వెల్లడించారు. తమ కుమార్తెకు వికలాంగు పింఛను మంజూరు చేయమని అనేకసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పింఛను మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్‌, ఐటిడిఎ పిఓ రోణంకి గోపాలకృష్ణ స్పందించి కాళ్లు యథావిధిగా పనిచేసేలా వైద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆనందబాబు కోరారు.