Sep 17,2023 21:24

దగ్థమవుతున్న దుకాణం

ప్రజాశక్తి- డెంకాడ : మండలంలోని అక్కివరం ఎపి మోడల్‌ స్కూల్‌ సమీపంలోని గొలగాం గ్రామానికి చెందిన షేక్‌ గౌరీ పాన్‌షాప్‌, అమకాం పంచాయతీ దుబ్బగుడ్డి గ్రామానికి చెందిన కొల్లుబోయిన రాజ్‌కుమార్‌ చికెన్‌ షాపులకు గుర్తు తెలియన వ్యక్తులు శనివారం అర్థరాత్రి నిప్పంటించారు. దీంతో ఈ రెండు దుకాణాలు పూర్తిగా దగ్థమయ్యాయి. షేక్‌ గౌరీకి సుమారు రూ. 1.50లక్షలు, రాజ్‌కుమార్‌కు రూ. 50వేలు వరకూ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ మహేష్‌ ఆదివారం ఉదయం పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.