
దేశంలో అందరికీ విద్యను ఉచితంగా అందించాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని సాధించడం, ఉపాధ్యాయుల స్థాయిని పెంచడం, విద్యారంగ సవాళ్ళను ఎదుర్కోవడం, ఇందుకోసం రూపొందించే ఉద్యమాల్లో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడం STFI లక్ష్యం. దీనిలో భాగంగా విద్యా హక్కు చట్టం బలోపేతం చేసి సక్రమంగా అమలు చేయాలని కోరుతూ జాతీయ సదస్సులు నిర్వహించడం జరిగింది. తిరోగమన జాతీయ విద్యా విధానం -2020ను ఉపసంహరించుకోవాలని ఎస్‌టిఎఫ్‌ఐ పోరాడుతోంది.
స్కూలు టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిఎఫ్‌ఐ) 8వ జాతీయ మహాసభ నేటి నుంచి మూడు రోజులపాటు విజయవాడలో జరగనుంది. ఎపియుటిఎఫ్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ జాతీయ మహాసభకు దేశవ్యాప్తంగా 31 ఉపాధ్యాయ సంఘాల నుంచి 1000 మంది ప్రతినిధుల హాజరు కానున్నారు. ఈ మహాసభల సందర్భంగా ఎస్‌టిఎఫ్‌ఐ ఆవిర్భావం, లక్ష్యాలు, దాని ప్రస్థానం గురించి క్లుప్తంగా వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.
జాతీయ ఉపాధ్యాయ ఉద్యమం
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి మన దేశంలో ఉపాధ్యాయ సంఘాలు ఆయా రాష్ట్రాల్లో ఉపాధ్యాయ సమస్యలపై ప్రధానంగా పనిచేస్తూ వచ్చాయి. కేంద్ర, రాష్ట్ర విద్యా విధానాలపై పరిమితంగా పోరాటాలు చేసేవి. కొన్ని రాష్ట్రాల్లో ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయుల వృత్తి భద్రత కోసం కృషి చేశాయి. కొంత మేరకు ఫలితాలు సాధించాయి. అయితే మన దేశానికి అవసరమైన విద్యా విధానం కోసం, ఉపాధ్యాయుల స్థితిగతులు మెరుగు పరచడానికి దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ ఉద్యమం అవసరం అని భావించి 1954లో ఆలిండియా ప్రైమరీ టీచర్స్ ఫెడరేషన్ (ఎఐపిటిఎఫ్), 1961లో ఆల్ ఇండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఎఐఎస్‌టిఎఫ్)లు అఖిల భారత స్థాయి ఉపాధ్యాయ సంఘాలను నెలకొల్పడం జరిగింది. అయితే ఈ సంఘాలు కొన్ని రాష్ట్రాలకే పరిమితం కావడం, ప్రాథమిక సెకండరీ సంఘాలుగా ఆయా ఉపాధ్యాయులు సమస్యల సాధనకే పరిమితం అయ్యాయి.
1974లో ఆంధ్రప్రదేశ్‌లో అన్ని క్యాడర్లు, మేనేజ్‌మెంట్ల కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులను సంఘటితపరచి రాష్ట్ర స్థాయి ఆం. ప్ర. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్( ఎపియుటిఎఫ్) ఆవిర్భవించింది. నేడు అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా అది విస్తరించింది. 1990లో అఖిల భారతస్థాయి ఉపాధ్యాయ సంఘంగా ఉన్న ఆలిండియా సెకండరీ టీచర్స్ ఫెడరేషన్ (ఎఐఎస్‌టిఎఫ్)లో ఎపియుటిఎఫ్ సభ్య సంఘంగా చేరింది. అయితే ఎఐఎస్‌టిఎఫ్ సెమినార్లు, మహాసభలకు మాత్రమే పరిమితం అయింది. ఉద్యమాలు నిర్వహించడంపై తగినంత శ్రద్ధ పెట్టలేకపోయింది.
సిసిఎస్‌టిఒ ఏర్పాటు
దేశవ్యాప్తంగా ప్రాథమిక, సెకండరీ ఉపాధ్యాయులను సంఘటిత పరచేలా, అభ్యుద భావాలు గల ఉపాధ్యాయ సంఘాలు, కార్యకర్తలు కలిగి ప్రగతి శీల పోరాటాల్లో ఉపాధ్యాయుల్ని కదిలించి పనిచేసే జాతీయ స్థాయి ఉపాధ్యాయ సంఘం అవసరమని ఆం.ప్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ భావించింది. 1981లో ఎపియుటిఎఫ్ రాష్ట్ర మహాసభల్లోనూ, ఆ తదుపరి మహాసభల్లోనూ వివిధ రాష్ట్రాల నుండి సౌహార్ధ ప్రతినిధులుగా హాజరైన వివిధ సంఘాల నాయకులతో ఎపియుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వం చర్చలు జరిపింది. జాతీయ స్థాయిలో పోరాట పటిమ గల ఉపాధ్యాయ సంఘ నిర్మాణానికి కృషి చేసింది. ఈ కృషి ఫలితంగా 1977 మార్చి 15,16 తేదీలలో చెన్నైలో ఆలిండియా టీచర్స్ కన్వెన్షన్ జరిగింది.
ఈ కన్వెన్షన్‌లో 8 రాష్ట్రాల నుండి 7 లక్షల మంది ఉపాధ్యాయులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 11 ఉపాధ్యాయ సంఘాల నుంచి 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వీరి నుండి 'కోఆర్డినేషన్' కమిటీ ఆఫ్ స్కూలు టీచర్స్ ఆర్గనైజేషన్ (షషర్‌శీ) ఏర్పడింది. షషర్‌శీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం 1997 నుండి 2000 వరకు అనేక కార్యక్రమాలు నిర్వహించింది. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 5 లక్షల మంది ఉపాధ్యాయుల సంతకలతో కూడిన వినతి ప్రతాన్ని అప్పటి భారత రాష్ట్రపతికి సమర్పించింది. ప్రతి సంవత్సరం ఆలిండియా డిమాండ్స్ డే పాటించడం వంటి కార్యక్రమాలు నిర్వహించింది. అన్ని రాష్ట్రాల్లో విద్యాహక్కు చట్టం కోసం రౌండ్ టేబుల్ సమావేశాలు, వర్క్ షాప్స్, ప్రదర్శనలు నిర్వహించింది.
STFI ఆవిర్భావం
ఈ కార్యక్రమాల అనుభవంతో జాతీయ స్థాయిలో పూర్తిస్థాయి ఉపాధ్యాయ సంఘం నిర్మించే ఉద్దేశంతో 2000 ఆగస్టు 11, 12, 13 తేదీలలో కలకత్తాలో 'స్టాల్ లేక్' స్టేడియంలో ccsto ఆధ్వర్యంలో ప్రధమ మహాసభ నిర్వహించారు. ఆ మహాసభ చేసిన తీర్మానానికి అనుగుణంగా ఆగస్టు 12న 'స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా' (STFI ) ఆవిర్భవించింది. ఆ మహాసభకు కేరళ నుండి KSTA, పశ్చిమ బెంగాల్ నుండి ABTA, ABPTA ఆంధ్రప్రదేశ్ నుండి APUTF, రాజస్థాన్ నుండి RTS పంజాబ్ నుండి PTU హర్యానా నుండి HRSA త్రిపుర నుండి TGTA, TTA పాండిచ్చేరి నుండి TAP తమిళనాడు నుండి TNPTF, TNPGTA, TIAS జమ్మూకాశ్మీర్ నుండి J&KUTA ప్రాతినిధ్యం వహించాయి.
STFI ' రెండవ' మహాసభ కేరళలోని పాల్ఘాట్‌లో 2003 ఫిబ్రవరి 6,7,8 తేదీల్లో జరిగింది. ఆ మహాసభకు అప్పటి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పలువురు మేధావులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. 'మూడవ' జాతీయ మహాసభ 2005 డిసెంబర్ 17, 18 తేదీలలో హైదరాబాద్‌లో Aూఖుఖీ ఆధ్వర్యంలో జరిగింది. నాల్గవ జాతీయ మహాసభ 2009 ఫిబ్రవరి 15, 16, 17 తేదీలలో రాజస్థాన్ లోని గంగానగర్‌లో నిర్వహించారు. ఐదవ జాతీయ మహా సభ 2012 మే 17, 18, 19 తేదీలలో తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగింది. 'ఆరవ' మహాసభ హర్యానాలోని హిస్సాలో 2015 ఫిబ్రవరిలో నిర్వహించగా, 'ఏడవ' జాతీయ మహాసభ ఒరిస్సా రాష్ట్రంలోని పూరీలో 2018 మే 17, 18, 19 తేదీలలో జరిగింది. ఈ మహాసభల నాటికి 22 రాష్ట్రాల నుండి 29 ఉపాధ్యాయ సంఘాలు భాగస్వాములయ్యాయి.
అందరికి ఉచిత విద్య - STFI లక్ష్యం
దేశంలో అందరికీ విద్యను ఉచితంగా అందించాలన్న రాజ్యాంగ నిర్దేశాన్ని సాధించడం, ఉపాధ్యాయుల స్థాయిని పెంచడం, విద్యారంగ సవాళ్ళను ఎదుర్కోవడం, ఇందుకోసం రూపొందించే ఉద్యమాల్లో ఉపాధ్యాయులను భాగస్వాములను చేయడం ూుఖీ× లక్ష్యం.
దీనిలో భాగంగా విద్యా హక్కు చట్టం బలోపేతం చేసి సక్రమంగా అమలు చేయాలని కోరుతూ జాతీయ సదస్సులు నిర్వహించడం జరిగింది. తిరోగమన జాతీయ విద్యా విధానం -2020ను ఉపసంహరించుకోవాలని ఎస్‌టిఎఫ్‌ఐ పోరాడుతోంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) బిల్లును ఉపసంహరించుకోవాలని, సిపియస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం కొనసాగించాలని, సమ్మెహక్కు కల్పించాలని తదితర డమాండ్లపై దేశవ్యాప్త ఉద్యమాలు ఎస్‌టిఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జరిగాయి. అలాగే 2008, 2015, 2016 లలో దేశవ్యాప్తంగా మహిళా, ఉపాధ్యాయ సమస్యలపై మహిళా టీచర్ల జాతీయ సదస్సులు వర్క్‌షాప్‌లు జరిగాయి.
సిపిఎస్ రద్దు - ఎన్‌ఈపి రద్దు
కాంట్రిబ్యుటరీ పెన్షన్ స్కీం రద్దు, నూతన జాతీయ విద్యా విధానం రద్దు నినాదం ఊపందుకుంటున్నది. ఉభయ తెలుగురాష్ట్రాల్లో జాతీయ విద్యా విధానం 2020ని ఉపసంహరించుకోవాలని, పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్‌టిఎఫ్‌ఐ ఎనిమిదో జాతీయ మహాసభ తెలుగు నాట ఉపాధ్యాయ ఉద్యమానికి నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది.
వ్యాస రచయిత ఐక్య ఉపాధ్యాయ పూర్వప్రధాన సంపాదకులు,
మొబైల్ నం:9440736061