Jun 09,2023 00:53
మండల రెండో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన పాలెపోగు రమాదేవికి ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న ఆర్డీవో సరోజిని

ప్రజాశక్తి-సంతమాగులూరు: సంతమాగులూరు మండల రెండో ఉపాధ్యక్షులుగా, మక్కెనవారిపాలెం గ్రామ ఎంపీటీసీ పాలెపోగు రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఆర్డీవో సరోజిని ప్రకటించారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయం సమావేశం హాలులో జరిగిన రెండో ఉపాధ్యక్ష ఎన్నిక ప్రశాంతంగా ముగిసిం ది. 17 మంది ప్రాదేశిక సభ్యులకు గాను, గతంలో సంతమాగులూరు ఎంపీటీసీకి అట్లా చిన వెంకటరెడ్డి రాజీనామా చేశారు. ప్రస్తుతం 16 మంది సభ్యులు ఉన్నారు. 16 మంది సభ్యు లలో 13 మంది సభ్యులు మాత్రమే ఉపాధ్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. ఏల్చూరు ఎంపీటీసీ సభ్యులు ఓరుగంటి కోటిరెడ్డి, మలిరెడ్డి రమాదేవి, కుందుర్రు ఎంపీటీసీ సభ్యురాలు తిరుపతమ్మ ఈ ఎన్నికలకు గైర్హాజరైనారు. మామిళ్లపల్లి ఎంపీటీసీ సభ్యులు గడిపూడి విజయభాస్కర్‌ రమాదేవిని ప్రతిపాదించగా, కామేపల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యులు మోదేపల్లి శ్రీనివాసరావు రమాదేవిని బలపరిచారు. దీంతో పాలెపోగు రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ణయించి ధ్రువీకరణ పత్రాన్ని ఆర్డీవో సరోజిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జీ లక్ష్మీదేవి, మండల ప్రత్యేక అధికారి రాజేష్‌, తహశీల్దారు అశోక్‌వర్దన్‌, ఎంపీటీసీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సిఐ ప్రభాకర్‌ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ ఎంవి శివకుమార్‌ బందోబస్తు నిర్వహించారు.