Jan 23,2023 23:56

వంటావార్పు చేపడుతున్న బాధితులు

ప్రజాశక్తి-కొత్తకోట:ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ తమ భూములు ఆక్రమించందంటూ సంఘటనా స్థలంలో బాధితులు చేపట్టన నిరసన దీక్ష సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. బాధనపాడు గ్రామానికి చెందిన పిల్లా అచ్చారావు కుటుంబ సభ్యులకు చెందిన సర్వే నెంబర్‌ 54 లో సుమారు 8 ఎకరాల భూమిని రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఆక్రమించిందంటూ కుటుంబ సభ్యులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. వీరిలో వీసం వరలక్ష్మి, కసా రత్నం దీర్ఘకాళిక వ్యాధులతో ఉన్నప్పటికీ మంచాల పైనే సంఘటనా స్థలంలో వంటా వార్పు చేసుకొని నిరసన చేపట్టారు.
సందర్శించిన అధికారులు
బాధనపాడులో నిరసన చేపట్టిన దీక్షా శిబిరాన్ని రావికమతం ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, మండల ఆర్‌ఐ చినబ్బాయి, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు శివ తదిత రులు సోమవారం సందర్శించారు. వ్యాధితో బాధపడుతున్న మహిళలను సొంత గ్రామాలకు తరలించాలని నచ్చజెప్పారు.