రెండో రోజుకు అక్కుర్తి దళితుల రిలే దీక్షలు
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
అక్రమంగా జారీ చేసిన పట్టాలను రద్దు చేయాలంటూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట శ్రీకాళహస్తి రూరల్ మండలం అక్కుర్తి గ్రామ దళితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. వీరికి సీఐటీయూ అనుబంధ హమాలీ యూనియన్ నాయకులు సంఘీభావం తెలియజేశారు. అక్కుర్తి రెవెన్యూ లెక్క దాఖలాలో సర్వే నం.73, 382లలో సుమారు 9 ఎకరాల దరఖాస్తు భూమిని ఆ గ్రామానికే చెందిన పది దళిత కుటుంబాల వారు 40 ఏళ్లుగా చేసుకుంటున్నా పట్టాలివ్వకపోవడం అన్యాయమని సీపీఎం పట్టణ బాధ్యుడు గంధం మణి ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఆ భూములపై అగ్రకులస్తులకు గుట్టు చప్పుడు కాకుండా పట్టాలెలా జారీ చేస్తారని ప్రశ్నించారు. వెంటనే అక్రమ పట్టాలను రద్దు చేసి దళితులకివ్వాలని డిమాండ్ చేశారు. గురవయ్య, హమాలీ నాయకులు ప్రసాద్, శివ, పొన్నెయ్య,అక్కుర్తి దళితులు పాల్గొన్నారు.
దీక్షల్లో అక్కుర్తి దళితులు










