రెండో రోజూ కనిపించని పులి పిల్లల తల్లి
పిల్లలను తల్లి వద్దకు చేర్చడం ఫారెస్ట్ అధికారుల లక్ష్యం
నల్లమల్లలో పులి కోసం ముమ్మరంగా గాలింపు
ప్రజాశక్తి -కొత్తపల్లి
నంద్యాల జిల్లా పెద్దగుమ్మడాపురం నల్లమల అడవి సమీప సోమవారం 4 పులి పిల్లల తల్లికోసం గాలింపు ముమ్మరం చేశారు. పులి పిల్లలు క్షేమంగానే ఉన్నాయి. పిల్లల తల్లి రెండో రోజు పులి కనిపించకపోవడంతో అధికారుల బృందం నల్లమల అడవుల్లో ముమ్మరంగా గాలిపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రంతా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కెమెరాలతో తనిఖీలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం జల్లడ పట్టినప్పటికీ పులి జాడ కనిపించలేదు. సోమవారం రాత్రి పులి జాడ కోసం నల్లమల ఫారెస్ట్ లో సుమారు 40 కెమెరాలను అమర్చి పరిశీలన చేసినప్పటికీ ఎక్కడ కూడా పులి ఆచూకీ లభ్యం కాలేదు. రాత్రి సమయంలో పెద్దగుమ్మడాపురం గ్రామానికి చెందిన గ్రామస్తులు గ్రామంలోకి పిల్లల కోసం పులి ఎప్పుడు వస్తుందో అని రాత్రంతా జాగరణ చేశారు.
పులి పిల్లలను తల్లి వద్దకు క్షేమంగా చేరుస్తాం
శ్రీశైలం అటవీశాఖ ఫీల్డ్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి
పులి పిల్లలు క్షేమంగా ఉన్నప్పటికీ పులి ఆచూకీ మాత్రం కనిపించలేదు. పులి జాడ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రాత్రి ఆరు గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కెమెరాలతో ప్రత్యేక బందాలు గాలింపు చర్యలు చేస్తున్నాయి. ఉదయకాలంలో మరి కొంతమంది ఫారెస్ట్ అధికారులు నల్లమల అడవిలోకి వెళ్లి కెమెరాలను పరిశీలించి పులి జాడలు ఏమైనా ఉన్నాయని తిరిగారు. మంగళవారం సాయంత్రం డిఎఫ్‌ఒ టేరాన్ ఆధ్వర్యంలో ఆచూకీ కోసం ఫారెస్ట్ వెంట తిరగడంతోపాటు ఫారెస్ట్ సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాలను పరిశీలించారు. అంతవరకు సమీప గ్రామానికి చెందిన గ్రామస్తులు వ్యవసాయ రైతులు ఏదైనా ఆచూకీ తెలిస్తే వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలి. పులి పిల్లలను ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పిన వారితో కూడా మాట్లాడుతున్నాం. రాత్రి కూడా పులి జాడ కోసం దాదాపు 100 కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ తనిఖీల్లో మార్కాపురం డిఎఫ్‌ఒ అయ్యప్ప సున్నిపెంట బయోడైవర్సిటీ రేంజ్ అధికారి మహమ్మద్ హయత్ రేంజర్లు పట్టాభిస్థానిక ఎఫ్‌ఎస్‌ఒ నాగేశ్వరరావు, ఫారెస్ట్ అధికారులు సిబ్బంది ఉన్నారు.










