ప్రజాశక్తి - ఆదోని
మహిళా రెజ్లర్లపై వేధింపులకు పాల్పడిన క్రీడా అసోసియేషన్ అధ్యక్షులు బ్రిడ్జ్ భూషణ్ చరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని వామపక్ష, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాసంఘాల ఆందోళనలో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు, ఉపాధ్యక్షులు పి.ఈరన్న, సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, గోపాల్, ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు భరత్, శ్రీనివాసులు, వ్యకాస మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడారు. రెజ్లర్లు ఆందోళన చేపట్టి 36 రోజులు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం విచారకరమని తెలిపారు. క్రీడాకారులకున్న హక్కులను రక్షించాలని, వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, వ్యకాస నాయకులు పాల్గొన్నారు.
నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు










