ఐద్వా ఆధ్వర్యాన నిరసన తెలుపుతున్న మహిళలు
ప్రజాశక్తి-పెందుర్తి : రెజ్లర్లపై దాడిని ఖండిస్తూ జివిఎంసి 96వ వార్డు పరిధిలోని సిఐటియు కార్యాలయం వద్ద మహిళా సంఘం నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఐద్వా జోన్ కార్యదర్శి లావణ్య మాట్లాడుతూ, దేశం పేరు ప్రఖ్యాతల కోసం కష్టపడిన రెజ్లర్లపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. సిపిఎం జోన్ కార్యదర్శి బి.రమణి మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై దాడులు పెరిగాయన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు శంకరరావు, అప్పలనాయుడు, ఐద్వా నాయకులు రజిని తదితరులు పాల్గొన్నారు.










