May 19,2023 00:56

ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా విలేకర్లు : ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్లకు మద్దతుగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లో గురువారం పలు సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా గుంటూరులోని ఇన్నర్‌ రింగురోడ్డులోని గాంధీ బొమ్మ వరకు ఐద్వా, సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ప్రదర్శన చేశారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్న బిజెపి ఎంపీ, రెజ్లర్‌ సంఘం అధ్యక్షులు బ్రిజ్‌భూషణ్‌సింగ్‌ను వెంటనే ఆ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి పదవి నుంచి తొలగించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. బిజెపి చెబుతున్న బేఠీ బచావో బేఠీ పడావో నినాదం ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు. రెజ్లర్లు పతకాలు సాధించినప్పుడు గొప్పలు చెప్పిన మోడీ, తన పార్టీ నాయకులే రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.శ్రీనివాస్‌, ఐద్వా నాయకులు పద్మ, రమణ, సుహాసిని, నాగలక్ష్మి, ఓబులేశ్వరి, ఫాతిమా, శాఖ సహాయ కార్యదర్శి ఎస్‌.కె.మస్తాన్‌వలి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పండు, మన్సూర్‌ పాల్గొన్నారు. పాత గుంటూరు మాచిరాజు వారి వీధి, పొత్తూరు వారి వీధి, కోబాల్టుపేట, ప్రగతి నగర్‌ ప్రాంతాల్లో నిరసనలు చేపట్లగా ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన రెజ్లర్ల ఆందోళనను పట్టించుకోకుండా, వేధింపులకు పాల్పడిన పార్టీ నాయకుడ్ని రక్షించాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమాల్లో ఐద్వా నగర అధ్యక్ష కార్యదర్శులు జి.రమణ ఎ.కళ్యాణి, ఎం.కృష్ణకుమారి, రాజకుమారి, నాగలక్ష్మి, మేరీ, పద్మ, కల్పన మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్డులో జిల్లా క్రీడా ప్రాంగణంలో కొవ్వుత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఆంజనేయ నాయక్‌, శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పెర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మల్లీశ్వరి, సిఐటియు పట్టణ కార్యదర్శి సిలార్‌ మసూద్‌ మాటాల్డఆరు. నాయకులు కె.రామారావు, ఐ.కోటేశ్వరరావు, ఎస్‌.దుర్గాభారు, షేక్‌ ఫాతిమా, పి.శ్రీనివాసరావు, హుస్సేన్‌, సుభాని, బి.సాయి కుమారి, శ్రీనునాయక్‌, మస్తాన్‌వలి పాల్గొన్నారు. చేబ్రోలులో ప్రదర్శన చేపట్టగా సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు దండా లక్ష్మీనారాయణ మాట్లాడారు. మండల కార్యదర్శి హనుమంతరావు, నాయకులు షర్ఫుద్దీన్‌, పూనం, కిన్నెర పాల్గొన్నారు. చిలకలూరిపేటలోని ఎన్‌ఆర్‌టి సెంటర్‌ వద్ద అంబేద్కర్‌ విగ్రహం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, సిఐటియు, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఆనంతరంగా ర్యాలీగా రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద గల శుభాస్‌ చంద్రబోస్‌ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లారు. యు.సిద్దు, నవిత, పెద్దిరాజు, నాగమ్మభాయి, శారదా, ఎస్‌.బాబు, ఎస్‌.లూథర్‌ పాల్గొన్నారు. సత్తెనపల్లిలోని పుతుంబాక భవన్‌ ఆవరణలో ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. పట్టణ కార్యదర్శి గద్దె ఉమాశ్రీ మాట్లాడారు. నాయకులు డి.విమల, జి.రజిని, టి.లక్ష్మి, స్పందన, కోటేశ్వరమ్మ, షేక్‌ సైదులు, రాజకుమార్‌, హరిపోతారాజు, మస్తాన్‌రావు, పురుషోత్తం పాల్గొన్నారు. తుళ్లూరులోని మల్కాపురం సెంటర్‌లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డివిజన్‌ కార్యదర్శి ఎం.భాగ్యరాజు మాట్లాడారు. నాయకులు గ్రేస్‌, సుజాత, శ్రీలత పాల్గొన్నారు. తెనాలిలోని రావి అమ్మయ్య చౌక్‌లో ప్రదర్శన చేపట్టగా సిఐటియు నాయకులు బాబూప్రసాద్‌ మాట్లాడారు. షేక్‌ హుస్సేన్‌వలి, ఎం.సాంబశివరావు, జి.వెంకటసుబ్బయ్య, ఎస్‌కె ఆషాబి, ఎస్‌కె బాజి, కె.శ్రీనివాసరావు, ఎస్‌కె సోదిత, ఎన్‌.రాజ్యలక్ష్మి, ఎన్‌ఎస్‌ లలిత, ఎన్‌.సాంబశివరావు పాల్గొన్నారు. మంగళగిరిలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నాయకులు ఎస్‌ఎస్‌ చెంగయ్య మాట్లాడారు. ఎం.రవి, బి.వెంకటేశ్వర్లు, వై.కమలాకర్‌, పి.పూర్ణ, కె.గోపి, కె.వెంగమ్మ, పి.మేరీ, జి.నాంచారమ్మ, ఎస్‌.శాంతి పాల్గొన్నారు. మంగళగిరి రూరల్‌లోని రాజధాని గ్రామమైన ఎర్రబాలెంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన తెలిపారు. సిఐటియు రాజధాని డివిజన్‌ అధ్యక్షులు ఎం.రవి మాట్లాడారు. నాయకులు ఒ.రామారావు, టి.ఆదిలక్ష్మిపాల్గొన్నారు. కాజలో ఐద్వా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మండల కార్యదర్శి ఎస్‌.విజయలక్ష్మి, సుమ, తిరుమల భారతి పాల్గొన్నారు. నిడమర్రు నిరసనలో ఎం.భాగ్యరాజు, జి.నాగేశ్వరరావు, కె.నాగేశ్వరరావు, కె.వెంకటేశ్వర్లు, కె.ప్రకాశరావు పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణంలోని కృష్ణుని గుడి సెంటర్‌లో గురువారం సిఐటియు ఆధ్వర్యంలో సంఘీభావ సభ నిర్వహించారు. పట్టణ కార్యదర్శి వి.దుర్గారావు మాట్లాడారు. ఫిరంగిపురం మండలంలోని పొనుగుపాడులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. కాజా మస్తాన్‌ వలి, జివిఆర్‌, షేక్‌ మస్తాన్‌వలి మహిళలు పాల్గొన్నారు