కొవ్వొత్తులతో ప్రదర్శనలో పాల్గొన్న మహిళలు
ప్రజాశక్తి-కంచరపాలెం : ఢిల్లీలో మహిళా రెజ్లర్లపై విరుచుకు పడి అరెస్టులు చెయ్యడాన్ని ఖండిస్తూ ఐద్వా కంచరపాలెం జోన్ కమిటీ ఆధ్వర్యాన మర్రిపాలెం శివనగర్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జోన్ అధ్యక్ష, కార్యదర్శులు కె.అనురాధ, ఎ.పుష్ప, సహాయ కార్యదర్శి ఎం.జయలక్ష్మి మాట్లాడుతూ, లైంగిక వేధింపులపై శాంతియుతంగా 42 రోజులు నుంచి మల్లయోధులు పోరాటం చేస్తున్నా బిజెపి ప్రభుత్వానికి చలనం లేదన్నారు. అత్యంత కిరాతకంగా వ్యవహరించి లాఠీఛార్జ్ చేసి, రోడ్డుపై అరెస్టులు చెయ్యడం దుర్మార్గం అన్నారు. బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను, హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను అరెస్టు చేయాలని, ప్రభుత్వ పదవుల నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.










