రెజ్లర్ల ఆందోళనలో పాల్గొన్న గంగయ్య
ప్రజాశక్తి-పిసిపల్లి: ఢిల్లీలో రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా పిసిపల్లి మండల జెవివి నాయకులు కరణం గంగయ్య సంఘీ భావం తెలిపారు. తమపై లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టారు. బుధవారం జెవివి నాయకులు గంగయ్య ఆందోళనలో పాల్గొని.. సంఘీభావం ప్రకటించారు.










