పాతగుంటూరులో సంఘీభావం తెలుపుతున్న మహిళలు, ఐద్వా నాయకులు
ప్రజాశక్తి-గుంటూరు : ఢిల్లీలో జరుగుతున్న రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో బుధవారం స్థానిక పాతగుంటూరు, శ్రామిక నగర్‌లో మహిళలు నిరసన తెలిపారు. రెజ్లింగ్ క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బిజెపి ఎంపి బ్రిడ్జి బూషణ్ శరణ్‌సింగ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని, పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, ఎంపి పదవి నుండి తొలగించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి ఎల్.అరుణ, నగర అధ్యక్షురాలు రమణ డిమాండ్ చేశారు. కృష్ణ, బుజ్జి, అను రాధ, సిఐటియు నాయకులు రమేష్ పాల్గొన్నారు.










