May 17,2023 22:08

సమావేశంలో పాల్గొన్న ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు

-కాకినాడ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు

ప్రజాశక్తి కాకినాడ
ఢిల్లీలో రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా కాకినాడ నగరంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి సిహెచ్‌. రమణి అధ్యక్ష వహిం చారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు డి.శేష బాబ్జి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, ఎస్‌.ఎఫ్‌.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. రాజా, ఆర్‌పిఐ సీని యర్‌ నాయకులు ఏ. రామేశ్వరరావు, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కే. రామకష్ణ మోహన్‌, కెవిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ కే. సింహాచలం, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు కెఎంఆర్‌ ప్రసాద్‌లు మాట్లాడుతూ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్‌, బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ అరెస్ట్‌ చేయాలని మహిళ రెజ్లర్ల చేస్తున్న ఆందోళనకు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాయ న్నారు. బ్రిజ్‌ భూషణ్‌ అరెస్ట్‌ చేయాలని దేశ రాజధానిలో గత 23 రోజుల నుండి ఆందోళన చేస్తున్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ కనీసం మాట్లాడకపోవడం దారుణమన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలపై, దళితులపై, గిరిజనులపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయన్నారు. రెజ్లర్లలు లైంగిక దాడి జరిగిందని ఆందోళన చేస్తుంటే ఈ సమస్యను పరిష్కరించ కుండా ఆందోళన చేస్తున్న వారిపై దాడి చేయడం, ఇబ్బందికి గురి చేయడం దారుణమన్నారు. నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ నిరసన ఆపకపోతే మీకే ప్రమాదం అని భయపెట్టడం ఏంటని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రెజ్లర్ల చేస్తున్న ఆందోళనకు మద్దతుగా 18వ తేదీన గ్రామ, వార్డు, ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని 20వ తేదీని జిల్లా కేంద్రంగా పెద్ద ఎత్తున మహిళలను, విద్యార్థులను, యువకులను, క్రీడాకారు లను కలుపుకుని ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎం. కష్ణమూర్తి, వి చందర్రావు, వి రవికుమార్‌, కృష్ణ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.