రెజ్లింగ్ పోటీలలో జాతీయ స్థాయికి ఎంపిక
ప్రజాశక్తి -ఏర్పేడు : ఏర్పేడు మండలం పల్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా విజయవాడ రూరల్ మండలం ' నున్న ' వికాస్ విద్యాసంస్థల ఆవరణలో జరిగిన 67వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ అండర్ 14 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలలో మోహనా చారి బంగారు పతకాన్ని సాధించి జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. నాగరాజు కాంస్య పతకం సాధించారు. క్రీడలలో విజయం సాధించిన విద్యార్థులను ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనం సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయానికి కారణమైన వ్యాయామ ఉపాధ్యాయురాలు పుష్పవాణిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మొదటి అసిస్టెంట్ కే బాబు , మోహర్ బాబా , వ్యాయామ ఉపాధ్యాయుని వాణి , రెడ్డప్ప , సోమశేఖర్ రాజు , రాజశేఖర్ పాల్గొన్నారు.










