Dec 14,2022 22:21

ప్రజాశక్తి-మైలవరం 

ఉమ్మడి కష్ణాజిల్లా స్కూల్‌ గేమ్స్‌ అండర్‌-14, అండర్‌-17, రెజ్లింగ్‌ పోటీల్లో స్థానిక లక్కిరెడ్డి హనిమిరెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. రాంప్రసాదరావు తెలిపారు. ఈ నెల 13వ తేదీన ఉంగుటూరులో జరిగిన పోటీలలో బి బద్దునాయక్‌ అండర్‌ 14, పి సిద్ధులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యా రన్నారు. వీరు ఈనెల 18,19 తేదీలలో చిత్తూరు జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. విద్యార్థులతోపాటు వ్యాయామ ఉపాధ్యాయులు కే వెంకయ్య, జి మెస్సి రోజీనాలను ఉపాధ్యాయులు,విద్యార్థులు సిబ్బంది అభినందించారు.