హిందూపురం : పట్టణంలోని పాంచజన్య బ్రిలియంట్ హైస్కూల్ విద్యార్థులు గ్రాప్లింగ్ రెజ్లీంగ్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలచి, జాతీయ స్థాయికి ఎంపిక అయినట్లు పాఠశాల అధ్యక్షులు పాంచజన్య శ్రీనివాసులు తెలిపారు. ఛాంపియన్‌గా నిలిచిన విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత నెల 29, 30న 3వ రాష్ట్ర స్థాయిలో సబ్ జూనియర్ బాల బాలికల గ్రాఫ్లింగ్ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్-2023 పోటీలు అనకాపల్లిలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారన్నారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది క్రీడకారులు పాల్గొన్నారని చెప్పారు. పాఠశాల తరపున 7వ తరగతి చదువుతున్న ధనుంజరు, షేక్ యాహియా పాల్గొని ఆటలో మంచి ప్రతిబా కనబర్చి బంగారు పథకం సాధించడంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయ్యారన్నారు. విద్యతో పాటు పాఠశాలలో క్రీడలకు అధిక ప్రాధన్యత ఇవ్వడంతో తమ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లోను ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నంద కుమార్, హెచ్‌ఎం గాయత్రి, ఎఒ భాస్కర్, సూపరింటెండెంట్ విజయేంద్ర, ఎహెచ్‌ఎంలు శశికళ, షేక్ అబ్దుల్ రజాక్, సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.










