ప్రజాశక్తి - భట్టిప్రోలు
చౌక ధరల దుకాణాలలో రేషన్ పంపిణీ వాహనదారుల బీమాను ప్రభుత్వ చెల్లించాల్సి ఉండగా ఆరు నెలలుగా చెల్లించకపోవడంతో బ్యాంకర్లు తమకు అందాల్సిన వేతనాన్ని జమ చేసుకుంటున్నారని వాహన డ్రైవర్లు తహశీల్దారు వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు. దీనివలన తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రేషన్ లబ్ధిదారుల నుండి రెండు విడతలుగా వేలిముద్రలు తీసుకోవడం వల్ల సమయా భావం కలుగుతుందని తెలిపారు. దీనికి తోడు లబ్ధిదారులు అసహనానికి గురై భౌతిక దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీమా సొమ్మును బ్యాంకులకు ప్రభుత్వమే చెల్లించాల్సి ఉండగా నిధులు విడుదల చేయకపోవడంతో తమకు అందాల్సిన అరకొర వేతనం బ్యాంకర్లు జమ చేసుకుంటే తామేమి తినాలని వాపోయారు. ప్రతినెలా 1న వేతనం జమ అయ్యే విధంగా చూడాలని కోరారు.










