ప్రజాశక్తి - వేమూరు
నిత్యావసర సరుకులు ప్రజా పంపిణి వ్యవస్థ ద్వారా అందించాలని సిపిఎం కార్యదర్శి బి అగస్టీన్ డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో అమృతలూరు డిప్యుటీ తాసిల్దార్ ఎం శివయ్యకు శుక్రవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా అగస్టీన్ మాట్లాడుతూ బయట మార్కెట్‌లో అహార సరుకుల ధరలు మండి పోతున్నాయని, పేదలే కాకుండా మధ్య తరగతి ప్రజలు సైతం కొనలేని విధంగా రేట్లు పెరిగాయని అన్నారు. కేంధ్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు అదుపుచేయడంలో విఫలయయ్యాయని ఆరోపంచారు. కందిపప్పు రూ.160లు, చింత పండు రూ.250, మిర్చి రూ.280, మినప్పప్పు రూ.130లు ఉందని అన్నారు. అన్ని రకాల సరుకుల ధరలు పెరిగి పోతే పేదలు ఎలా బ్రతకాలని ప్రశ్నించారు. ప్రభుత్వాలు పెరిగే ధరలను అదుపు చేయాలని కోరారు. రేషన్ దుకాణాల్లో బియ్యం, పంచదారతోపాటు అన్ని నిత్యవసర సరుకులు తక్కువ ధరకే పేదలకు ఇవ్వాలని కోరారు. ప్రజాపంణీ వ్యవస్థను పటిష్టం చేయాలని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి రాజు, చావలి రమేష్, కె శాంసన్, అమృతరావు, ముల్పూరు సతీష్ పాల్గొన్నారు.










