
పల్నాడు జిల్లా/ఈపూరు/కారంపూడి/దుర్గి: పల్నాడు జిల్లాలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప రడ్డి రెండో రోజైన శుక్రవారం పర్యటించారు. పర్యటనలో ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామం లోని రేషన్ షాపులను తనిఖీ చేశారు. దగ్గర్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం మండల కేంద్రం ఈపూరు కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో ఆహారం వండుతున్న తీరు పరిశీలించి పరిశుభ్రంగా ఆహార పదార్థాలు తయారుచేసి పిల్లలకు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రాథ మిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం లో రికార్డులను పరి శీలించారు. కారంపూడి ఏపీ మోడల్ స్కూల్, కారంపూడి మండలం, మిరియాలలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. దుర్గి మండలం అడిగోప్పల ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వంటలను పరిశీలించారు. పాఠశాలలో ఉపాధ్యాయులను ఆహార వివరాలను, వంట చేస్తున్న ఆయా లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన పర్యటనలో రేషన్ షాపులు, గోడౌన్లు, స్కూళ్లలో ఆహార పంపిణీ, అంగన్వాడి కేంద్రాలు, వసతి గృహాలు, ఏపీ మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో వడ్డిస్తున్న ఆహారం ప్రతి ఒక్కటి పరిశీలించినట్లు విజయ ప్రతాపరెడ్డి చెప్పారు ఫుడ్ కమిషన్ చైర్మన్ తో పాటు డీఎస్‌ఓ పద్మశ్రీ, సివిల్ సప్లై డిఎం వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.