
మహిళలతో మాట్లాడుతున్న ఐద్వా నాయకులు మాణిక్యం, సుభాషిణి
ప్రజాశక్తి -అనకాపల్లి
చౌక డిపోల ద్వారా గతంలో ఇచ్చినట్లే 14 రకాల సరుకులను ప్రజలకు ప్రభుత్వం అందించాలని ఐద్వా జిల్లా అధ్యక్షులు పి.మాణిక్యం, నాయకులు జి.సుభాషిని డిమాండ్ చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో మంగళవారం అనకాపల్లి నర్సింగరావుపేట ఏరియా మహిళలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్న నేపథ్యంలో చౌక డిపోల ద్వారా పేదలకు సరుకులు అందించాలని కోరారు. నిత్యావసర వస్తువుల ధరలు, వంటగ్యాస్, విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఆర్.లక్ష్మి, జి.వరలక్ష్మి, బి.మణి, ఎల్ లక్ష్మి, విజయలక్ష్మి, ఎం రాజేశ్వరి, ఎం దివ్య తదితరులు పాల్గొన్నారు.