Nov 18,2023 23:48

రేషన్‌ బియ్యం వాహనంలో కట్టెలు తరలింపు

రేషన్‌ బియ్యం వాహనంలో కట్టెలు తరలింపు
ప్రజాశక్తి - బాలాయపల్లి: ఇంటి వద్దకే వెళ్లి రేషన్‌ సరుకు లు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాహనా లు అందిస్తే ఆ వాహనాలలో కట్టెలు తోలుతూ కనిపించిన సంఘటన శనివారం మండలంలోని జయంపు గ్రామంలో చోటుచేసుకుంది. రేషన్‌ సరుకులు ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేసేందుకు నిరాకరిస్తున్న వాహన మిత్రలు కట్టెలు తోలుకునేందుకు ఉపయోగిం చుకోవడం దారుణమని, ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు పంపిణీ కోసం సబ్సిడీపై వాహనాలను అందజేస్తే ఆ వాహనాలను కట్టెలు తోలు కునేందుకు ఉపయోగించుకోవడం దారుణమని జయంపు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.