Sep 01,2022 23:30

భీమిలి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టిడిపి నాయకులు.

ప్రజాశక్తి -భీమునిపట్నం : పేదలకు చేరాల్సిన రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌చేసి, విదేశాలకు అక్రమంగా తరలించడం ద్వారా కొంతమంది వైసిపి నేతలు సొమ్ము చేసుకుంటున్నారని టిడిపి నేతలు ధ్వజమెత్తారు. గురువారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద వైసిపి రేషన్‌ బియ్యం దందాను నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ముందుగా స్థానిక రేషన్‌ డిపో ఎదుట నిరసన, అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి సొమ్ము చేసుకుంటున్న వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈమేరకు తహసీల్దార్‌ కోరాడ వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు డిఎఎన్‌ రాజు, మాజీ జెడ్‌పిటిసి డి దామోదరరావు, సరగడ అప్పారావు, పార్టీ నగర కార్యదర్శి పిట్ట సురేష్‌, చేనేత సంఘం రాష్ట్ర కార్యదర్శి వానపల్లి సత్య, 1,2,3,4 వార్డుల టిడిపి అధ్యక్షులు టి సూరిబాబు, బడిగంటి నీలకంఠం, గంటా నూకరాజు, పాసి నరసింగరావు, ఎస్‌సి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు పతివాడ రాంబాబు , తెలుగు యువత ప్రధాన కార్యదర్శి డి సిద్ధార్థవర్మ తదితరులు పాల్గొన్నారు.