May 07,2023 00:47

నిల్వ ఉన్న బియ్యంతో విజిలెన్స్‌, సివిల్‌సప్లై అధికారులు

ప్రజాశక్తి - ఆరిలోవ : రేషన్‌ డిపోలో అనధికారికంగా నిల్వ ఉన్న రేషన్‌ బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఆరిలోవ కాలనీ 358 డిపోను శనివారం విజిలెన్స్‌, సివిల్‌ సప్లై అధికారులు తనిఖీ చేశారు. అదనంగా సుమారు 700 కిలోల బియ్యం ఉన్నట్టు గుర్తించారు. అదనంగా నిల్వ ఉన్న బియ్యాన్ని సీజ్‌ చేసి, డిపో నిర్వాహకునిపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్‌ సిఐ కోటేశ్వరరావు, ఆర్‌ఐ రమేష్‌ పాల్గొన్నారు.