Jul 06,2023 23:20

వరగానిలో పట్టుబడిన బియ్యం, నిందితుడు

ప్రజాశక్తి - ప్రత్తిపాడు : నియోజకవర్గ కేంద్రమైన ప్రత్తిపాడులోని జెట్టిమిట్ట బజారులోని ధూపాటి సుబ్బారావు ఇంట్లో నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వనవర్తి యేసయ్య అనే వ్యక్తి వీటిని సేకరించి 44 సంచుల్లో నిల్వ ఉంచారని ఎస్‌ఐ రవీంద్ర తెలిపారు. యేసయ్యను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా రేషన్‌ మాఫియా కనుసన్నల్లో కొంతమంది ఉప్పు, ముగ్గు అమ్మకం పేరుతో రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారని, వాటిని రేషన్‌ మాఫీ నల్లబజారుకు తరలిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటి వారిని ఎంతో మంఇని రేషన్‌ మాఫియా గ్రామాల వారీగా పంపించి కార్డుదారుల వద్ద నుండి రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి కూడా మండలంలోని రావిపాటివారిపాలెంలోనూ అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాం పట్టుబడిన విషయం తెలిసిందే.
ప్రజాశక్తి - పెదనందిపాడు : మండలంలోని వరగానిలో అక్రమంగా నిల్వ ఉంచిన 29 మూటల రేషన్‌ బియ్యాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. నాగులపాడుకు చెందిన డి.కోటయ్య అనే వ్యక్తి వరగానిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఈ బియ్యం నిల్వ చేసినట్టుగా సమాచారం రావడంతో తనిఖీ చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ షేక్‌ అబ్దుల్‌ రెహమాన్‌ తెలిపారు.