Oct 09,2023 00:04

ప్రజాశక్తి - ఇంకొల్లు రూరల్‌
అక్రమంగా తరలిస్తున్న 100బస్తాలు రేషన్ బియ్యం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నసంఘటన ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.  పర్చూరు ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తాసిల్దార్ గీతారాణికి అందిన సమాచారం మేరకు సిబ్బందితో నిఘా పెట్టారు. తెల్లవారుజామున సుమారు 4.30గంటల సమయంలో రాచపూడి గ్రామం వైపు నుండి వస్తున్న రేషన్ బియ్యం మినీ లారీ వాహనాన్ని హనుమోజిపాలెం గ్రామం వద్ద ఆపి తనిఖీచేశారు. మినీలారీలో 100బస్తాల రేషన్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. బియ్యాన్ని, మినీ లారీని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవర్ నూతలపాటి లక్ష్మీనారాయణ, లారీ యజామాని ఆరవ మహేశ్వరరెడ్డి, రాచపూడి గ్రామస్తుడైన వెంకట సుబ్బారావుపైన స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై షేక్ నాయబ్ రసూల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 100బస్తాల రేషన్ బియ్యం విలవ సుమారు రూ.1.90లక్షలు ఉంటుందని అంచనా. ఇదిలా ఉండగా బియ్యం స్వాధీనం చేసుకున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వలేదు. సమాచారం చెప్పడానికి ఫోనులో కూడా స్పందించలేదు.