Oct 28,2023 00:46
మాట్లాడుతున్న గుంటూరు రేంజ్‌ ఐజి పాల్‌ రాజు

గుంటూరుసిటీ: జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కాన్ఫరెన్స్‌ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రెసివ్‌ రివ్యూ మీటింగ్‌లో గుంటూరు రేంజ్‌ ఐజి పాల్‌ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ గుంటూరు రేంజ్‌ పరిధిలో బైక్‌ , కారు రేసింగ్‌ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిషే ధించినట్లు చెప్పారు. నిబంధనలను అతిక్రమించి బైక్‌, కారు రేసింగ్‌ లు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా గ్రేవ్‌,నాన్‌ గ్రేవ్‌ లాంగ్‌ పెండింగ్‌ కేసు లలో దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులను ఆద ేశించారు. వాటితో పాటు ఇప్పటి వరకు జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకొని సదరు కేసులను సాధ్యం అయి నంత వరకు త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. 'జగనన్నకు చెబుదాం' కు ఫోన్‌ కాల్స్‌ ఫిర్యాదుల పట్ల అప్రమత్తంగా ఉం డాలని సదరు సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కోర్టు తీర్పు ద్వారా శిక్షలు పడిన కేసులలో రౌడీ షిట్స్‌ ఒపెన్‌, వారిపై ప్రత్యేక నిఘా పెట్టి, రౌడీ షీట ర్లను బైండోవర్‌ చేయాలని, రోడ్డు ప్రమాదాలు, ప్రాపర్టీ , మిస్సింగ్‌ కేసులు అరికట్టే విధంగా ప్రతి అధికారి పని చేయాలని చట్టా వ్యతిరేక కార్య కలాపాలకు పాల్పడుతున్న వారితోపాటు బహి రంగ ప్రదేశాల్లో మద్యం సేవించి వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు స్టేషన్‌ పరిధిలో ఉన్న నైట్‌ డ్యూటీ చూస్తున్న అధికారులు సిబ్బందికి బ్రీఫింగ్‌ చేసి పంపాలన్నారు. గంజా సేవించే వారిపై కఠించాలని తీసుకొని గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంతోపాటు పూర్తి స్థాయిలో గంజాయి విక్రయాలను అరికట్టాలి అన్నారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలను పరి ష్కరించేందుకు కృషి చేయాలని, రోడ్డుకు అడ్డంగా ఉండే తోపుడు బండ్లు, బండ్లతోపాటు ట్రాఫిక్‌ కు అంతరాయం కలిగించిన వారిపై పెట్టీ కేసులు నమోదు చేసి వారిని కోరుల్టో హాజరు పరచాల న్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ లు సుప్రజ , నచికేట్‌ షెల్కే, కె.శ్రీనివాసరావు, కె. కోట ేశ్వర రావు, డీఎస్పీలు పాల్గొన్నారు.