Oct 08,2023 20:58

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎ. రామాంజులు

రాయచోటి టౌన్‌  : ఈ నెల 10 , 11 తేదీల్లో కలెక్టరేట్‌ ఎదుట యానిమేటర్ల 36 గంటల ధర్నా నిర్వహి ంచనున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన యాని మేటర్ల మండల సమావేశంలో ఆయన మాట్లా డారు. యానిమేటర్లకు మూడేళ్ల కాల పరిమితి వరకే ఉద్యోగం ఉండేలా విడుదల చేసిన జీవో నంబర్‌ 64ను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. గ్రామా ల్లో పేదరిక నిర్మూలనకు పొదుపు సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతికి తోడ్పడే 28 వేల మంది యాని మేటర్ల కుటుంబాలు ప్రభుత్వ అనాలోచనతో వదిలిన 64వ సర్క్యులర్‌ తో రోడ్డున పడతారని వాపోయారు. ప్రభుత్వం పునరాలోచించుకొని మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ. 8 వేల వేతనంలో ప్రభుత్వ యాప్‌లకు, రవాణా ఖర్చులకు రూ. 3వేలు ఖర్చు పోగా కేవలం రూ. 5 వేలతో కుటుంబాలు నెగ్గుకు రావాలంటే చాలా ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. జీతాలు రాక, చేసిన అప్పులతో ఆందోళన గురవుతున్నారని చెప్పారు. పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, పరిగిన ధరలతో తీవ్ర ఇక్కట్లతో మానసిక క్షోభకు గురువుతన్నారని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. యానిమేటర్ల సంఘం జిల్లా పధాన కార్యదర్శి జి రెడ్డెప్ప, ఉఫాధ్యక్షులు క్రిష్ణమ్మ మాట్లాడుతూ ధరలకనుగుణంగా కనీసవేతనం రూ. 21 వేలు ఇవ్వాలని, సిబిఒహెచ్‌ఆర్‌ అమలు చేసి సంఘాల మెర్జింగ్‌ ఆపాలని డిమాండ్‌ చేశారు. అన్నమయ్య జిల్లాలో గ్రూపులు తక్కువ ఉన్నాయనే నెపంతో విధుల నుంచి తప్పించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. జిల్లాలోని యానిమేటర్లు 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యానిమేటర్లు కన్యాకుమారి, చెన్నమ్మ, ప్రసన్న పాల్గొన్నారు.