రేపు విజయవాడలో కెవిపిఎస్ మహాధర్నా
ప్రజాశక్తి -సత్యవేడు
దళితుల హక్కుల రక్షణకై ఈనెల 29న విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.అరుణాచలం అన్నారు. సత్యవేడులో గోడపత్రికను విడుదల చేశారు. కెవిపిఎస్ నిర్వహిస్తున్న దళిత రక్షణ యాత్రలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లోనూ ఎస్సీ కాలనీల్లో పాదయాత్రలు, రౌండ్‌టేబుల్ సమావేశాలు నిర్వహించి కరపత్రాలను పంపిణీ చేస్తూ దళితులను చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమేష్ పాల్గొన్నారు.
వరదయ్యపాళెంలో... మైనార్టీ నాయకులు బాష ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. దళిత గిరిజనులకు 200 యూనిట్లు ఉన్న ఉచిత విద్యుత్‌ను 300 యూనిట్లకు పెంచాలన్నారు. మిగులు భూములు ప్రజలకు పంచాలని, డప్పు కళాకారులకు పింఛన్ ఐదువేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గోడపత్రికను ఆవిష్కరిస్తున్న నేతలు










