కృష్ణదాస్, వైసిపి జిల్లా అధ్యక్షులు
ప్రజాశక్తి - నరసన్నపేట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఈనెల 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ కుటుంబ సభ్యులంతా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల 46 మందితో ప్రకటించిన నూతన జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం చేయనుందని తెలిపారు. కార్యక్రమానికి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు హాజరు కానున్నారని పేర్కొన్నారు.










