Apr 04,2023 22:41

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: మొగల్‌రాజపురంలోని పి.బి.సిద్దార్ద కళాశాల ఎలక్ట్రానిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన కళాశాల ఆడిటోరియంలో 'ఎలక్ట్రోవిజన్‌ - 2023' ని నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తెలిపారు. కళాశాల కాన్ఫరెన్స్‌హాల్‌లో ఎలక్ట్రోవిజన్‌కు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈసందర్భంగా ప్రిన్సిపాల్‌ రమేష్‌ మాట్లాడుతూ విద్యార్ధినీ, విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించంతో పాటు సబ్జెక్టులో వివిధ అంశాలలో ప్రయోగాలను ప్రోత్సహించే విధంగా ఎలక్ట్రోవిజన్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో తమ కళాశాలతో పాటు ఇతర కళాశాల విద్యార్థులు కూడా పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలు ఉంటాయన్నారు. వాటిలో ప్రదానంగా పోస్టర్‌ ప్రజంటేషన్‌, పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌, ప్రాజెక్టు ఎగ్జిబిషన్‌, టెక్నికల్‌ క్విజ్‌, సర్క్యూట్‌ డిజైనింగ్‌, ఐసి ఐడెంటిఫికేషన్‌, స్పాట్‌ ఫోటోగ్రఫీ, నిది అన్వేషణ, ఫ్యాషన్‌ షో, కాయిన్‌ ఫౌండింగ్‌ అంశాలలో పోటీలు ఉంటాయని తెలిపారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో కళాశాలడైరెక్టర్‌ వి.బాబూరావు, ఎలక్ట్రానిక్స్‌ విభాగాధిపతి కె.వి.యస్‌. సాంబశివరావు, డి.శ్రీనివాసరెడ్డి, జి.నాగశశాంకా, విద్యార్థులు పాల్గొన్నారు.