Aug 25,2023 21:52

రేపు ముస్లిం ఐక్యవేదిక సమావేశం

 కడప అర్బన్‌ : గుంటూరులో ఈనెల 27న నిర్వహిం చనున్న ముస్లిం ఐక్యవేదిక సమావేశాన్ని విజయవంతం చేయాలని ఐక్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సయ్యద్‌ సలావుద్దీన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పలువురు ముస్లిం నాయకులను మహాసభల ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించి దాదాపుగా వివిధ పార్టీలకు చెందిన 200 మందిని వ్యక్తిగతంగా కలిసి ఆహ్వాన పత్రాలను అందజేసినట్లు పేర్కొన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మత పెద్దలు కలిసి గుంటూరులో ముస్లిం ఐక్యవేదిక సమావేశాన్ని విజయవంతానికి కషి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ముస్లింలు, మేధావులు హాజరై విజయవంతానికి పిలుపునిచ్చారు. సమావేశంలో ముస్లింల ఎదుర్కొంటున్న సమస్యలు, రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలను చర్చించి తమ హక్కుల కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు.
ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న సలావుద్దీన్‌