ప్రజాశక్తి-విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 26వ తేదీన ఒక రోజు పర్యటన నిమిత్తం విశాఖపట్నం రానున్నారని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాల్గొనే, కార్యక్రమాలను నిర్వహించే బీచ్ రోడ్డులోని ఎయు కన్వెన్షన్ సెంటర్, ఎయు కాన్వొకేషన్ హాల్ నందు ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ కెఎస్.విశ్వనాధ్, పోలీసు కమిషనర్ శ్రీకాంత్, ఎయు వీసీ ప్రసాద్‌రెడ్డిలతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పాల్గొనే ప్రదేశాలలో ఎల్‌ఇడి స్క్రీన్‌ల ఏర్పాటు, లైటింగ్, ఎగ్జిక్యూటివ్ చైర్స్, పోడియం ఏర్పాట్లు, ముఖ్యమంత్రి ప్రవేశించు మార్గం, ఇతర ప్రముఖులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిటింగ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాటు పబ్లిక్ ఎడ్రస్ సిస్టమ్‌కు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. పార్కింగ్, బందోబస్తు ఏర్పాట్లు గురించి పోలీసు అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీసు, జివిఎంసి అధికారులు పాల్గొన్నారు.










