May 31,2023 23:22

యంత్ర సేవా పథకం లబ్ధిదారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి

ప్రజాశక్తి-గుంటూరు : డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ యంత్రసేవ పథకం కింద ట్రాక్టర్లు, హార్వెస్టర్లను రైతులకు అందించే రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని గుంటూరులో శుక్రవారం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు మిర్చియార్డులో ఉంచిన ట్రాక్టర్లు, హార్వెస్టర్లను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి బుధవారం పరిశీలించారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్‌టిఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు సంబంధించి జిల్లాల వారీగా ట్రాక్టర్లను వరుస క్రమంలో ఉంచాలన్నారు. లబ్దిదారులకు, వాహన డ్రైవర్లకు బస ఏర్పాట్లు, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, తాగునీరు, రాత్రి భోజనం సకాలంలో అందించాలని చెప్పారు. వీరికి అసౌకర్యమేమీ కలగకుండా చూడాలన్నారు. పరిశీలనలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎం.వెంకటశివరామిరెడ్డి, జెడ్పీ సిఇఒ జె.మోహన్‌రావు, డిఆర్‌డిఎ పీడీ హరిహరనాథ్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఎన్‌.వెంకటేశ్వర్లు, మార్కెటింగ్‌ ఏడీ రాజబాబు, డిపిఒ కేశవరెడ్డి, డిసిఒ వీరాచారి పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : సిఎం జగన్‌ పర్యటన బందోబస్తుపై జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌ సమీక్షించారు. తొలుత హెలిపాడ్‌ వద్ద స్థలాన్ని పరిశీలించారు. హెలిప్యాడ్‌ చుట్టూ కట్టుది ట్టమైన భారీ కేడింగ్‌ ఏర్పాటు చేసి, తగినంత మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. హెలిప్యాడ్‌ నుండి చుట్టుగుంట సర్కిల్‌ వరకు రోడ్డుకి రువైపులా భద్రతా బలగాలతో అణువణువు ముమ్మర తనిఖీలు నిర్వహించాలన్నారు.