
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యాన ఈనెల 7 నుంచి ఫిబ్రవరి 28 వరకు వివిధ దశల్లో చెకుముకి సైన్స్ సంబరాలను నిర్వహిస్తున్నామని, ఈ సంబరాలను విజయవంతం చేయాలని కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహనరావులు అన్నారు. ఆదివారం నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షులు కుప్పిలి కామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జెవివి రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ పిలుపుమేరకు దేశవ్యాప్త సైంటిఫిక్ టెంపర్ క్యాంపెయిన్‌లో భాగంగా జనవిజ్ఞాన వేదిక దేశవ్యాప్త శాస్త్ర విజ్ఞాన ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సైంటిఫిక్ టెంపర్ క్యాంపెయిన్‌ను జిల్లాలో అన్ని మండలాల్లో పట్టణాల్లో గుర్తించిన గ్రామాల్లో విజయవంతం చేయాలన్నారు. ఈనెల 10న పాఠశాల స్థాయిలో జరగనున్న చెకుముకి సైన్స్ టెస్ట్ పేపర్లను మండల కన్వీనర్‌లకు అందజేశారు. ఈ సమావేశంలో సాయి శ్రీనివాస్ శర్మ, జెవివి జిల్లా గౌరవ అధ్యక్షులు బొడ్డేపల్లి జనార్ధనరావు, ఉపాధ్యక్షులు పాలకొండ కూర్మారావు, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపతిరావు కిషోర్ కుమార్, జిల్లా నాయకులు లండ బాబురావు, దమయంతి, సామ సంజీవరావు, సిహెచ్ ఉమామహేశ్వరరావు, అగతముడి వాసుదేవరావు, తమ్మినేని వైకుంఠరావు, పేడాడ వేదవతి, ఎస్ రాజా, శ్రీనివాసరావు, ఎల్ సుందరరావు, సూర్యనారాయణ, రామకృష్ణారావు, గౌరీ శంకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.