
బాల బాలికలం మేము/
రేపటి భావి భారత పౌరులం/
గాంధీ, నెహ్రూ వారసులం/
దేశభక్తి, చదివే శక్తి మా హక్కని భావిస్తాం/
మంచి అలవాట్లను అలవర్చుకుని/
ఆట పాటలతో జ్ఞానం పెంచుకుని/
ఎన్నో విషయాలు తెలుసుకుని/
ముందుకుసాగే రేపటి పౌరులం/
చందమామ కథలైనా, పంచతంత్రం కథలైనా, బేతాళ కథలైనా/ స్పైడర్ మాన్, సూపర్ మాన్, హ్యారీ పోర్టర్ కథలైనా/
అద్భుత, వీర, హాస్య, శాంత, కరుణ రసాలు మాలో నింపి/
విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తాయి, అలరిస్తాయి/
కరోనా వచ్చినా, కరువు వచ్చినా/
ఇంటి వద్దనే వుండి/
పాఠశాలలు లేకున్నా,
పాఠాలెన్నో నేర్చాము/
చిత్రాలెన్నో వేశాము,
పండగలెన్నో చేశాము/
అమ్మ చేతి అలనాటి పిండి వంటల/ రుచులు చూసి మెచ్చాము/
నెహ్రూ పుట్టినరోజు బాలలదినోత్సవం/
నరకుని చంపిన రోజే దీపావళి పర్వం/
రెండు కలిసి వచ్చిన దినమే సంబరాల సంబరం/
అందరు పిల్లలూ కలిసి,
స్నేహభావమున మెలగగా/
బాలల దినం ఘనముగా చేయాలి/
కాలుష్యం చేయని టపాసులు కాల్చాలి/
నాన్న అమ్మ ఆప్యాయతలు/
తాతా అవ్వల దీవెనలు/
ఉపాధ్యాయుల భోదనలు/
మా మంచి అలవాట్లకు రహదారులు/
చందమామను చూసినా/
నీటిలో చేపలు ఈదినా/
రంగురంగుల పూలను కన్నా/
సీతాకోక చిలుకలు ఎగిరినా/
ఇంద్రధనస్సు ఆకాశంలో కనపడినా/
వర్షపు చినుకులు నేలరాలిన/
ప్రకృతిలో అన్నీ మా కొరకేనని/ సంబరపడిపోయే పిల్లలం/
రేపటి భావి భారత పౌరులం/
మా భవితవ్యం తరగతి గదుల్లో/
మా భవిష్యత్తు పెద్దల చేతుల్లో/
తీర్చి దిద్దాలని ప్రార్థించెదము/
భారతావని కీర్తిని పెంచెదము !
- కంచనపల్లి
99852 95605