Jul 25,2023 20:51

విద్యుత్‌ ఎస్‌ఇకి సమ్మె నోటీసు ఇస్తున్న జెఎసి నాయకులు


కడప : పవర్‌ ఎంప్లాయిస్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 27 నుంచి ఆగస్టు 10 వరకువివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి ఎస్‌. రమణకు జిల్లా జెఎసి చైర్మన్‌ యు.ఎస్‌.కె. బర్నబాస్‌, ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. చాంద్‌ బాషా, కన్వీనర్‌ ఎం వి. చలపతి సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఈనెల 27, 28 తేదీలలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, 31న మెమోరెండాలు అందజేత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 1న నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. 2,3 తేదీలలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. 4,5,7 తేదీలలో వర్క్‌ టు రూల్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8న విజయవాడలోని విద్యుత్‌ సౌద వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. 9న విద్యుత్‌ సంస్థ ఇచ్చిన సిమ్‌ కార్డులను తిరిగి యాజమాన్యానికి అందజేసే కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.10న సమ్మె ఉంటుందని చెప్పారు.