ప్రజాశక్తి-యంత్రాంగం :
సింహాచలం: అడవివరం గ్రంథాలయంలో ఈ నెల 8వ తేదీ నుంచి వేసవి శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు గ్రంథాలయాధికారి నరసింహం తెలిపారు. దీనికోసం అడవివరం ప్రాంతంలో ఉన్న వివిధ పాఠశాలలకు ఆహ్వాన పత్రాలను పంపినట్లు పేర్కొన్నారు. ఈ శిబిరానికి సంబంధించిన పోస్టర్లను శనివారం విడుదల చేశారు.
పెందుర్తి: శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు గ్రంథాలయాధికారి బి.సూర్యకళ తెలిపారు. ఈ నెల 8 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్న వేసవి విజ్ఞాన శిబిరానికి సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూర్య కళ మాట్లాడుతూ, సృజనాత్మకతకు దోహదపడే విజ్ఞాన శిబిరం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పథకంశెట్టి భూలోకరావు, ఆడారి రామకృష్ణ, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.










