కడప అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సేవకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఈనెల 20,21వ తేదీలలో తహశీల్దార్ కార్యాలలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతున్నట్లు గ్రామ సేవకుల సంఘం గౌరవాధ్యక్షులు మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం సిఐటియు జిల్లా కార్యాలయంలో విలేక రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రిలే దీక్షలు నిర్వహించాలని తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా 2017, మార్చి 24 న గ్రామ సేవకుల ధర్నాకు వచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.15 వేల జీతం పెంచుతానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ హామీని తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నాలుగేళ్లు దాటినా పెంచకపోవడం బాధాకరమని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. అర్హులైన విఆర్‌ఎలందరికీ అటెండర్, వాచ్‌మెన్, డ్రైవరు, విఆర్‌ఒ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాతల ముత్తాతల కాలం నుంచి పని చేస్తున్న వారిని నామి నీలుగా గుర్తించాలి, డిఎ రికవరీని ఆపి తీసుకున్న డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వా లని కోరారు. గ్రామ సేవకుల సమస్యల పరిష్కారానికి ఆగస్టు 7, 8న కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు, 25న చలో విజయవాడ కార్యక్ర మాన్ని నిర్వహిస్తామని, విఆర్‌ఎలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, విఆర్‌ఎ యూని యన్ జిల్లా అధ్యక్షులు నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి వెంకటపతి పాల్గొన్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న గ్రామసేవకుల సంఘం గౌరవాధ్యక్షులు మనోహర్










